టీజర్ తో రెడీ అయిన శర్వానంద్ , సాయి పల్లవి

Tuesday,October 09,2018 - 10:04 by Z_CLU

‘ప‌డిప‌డి లేచే మ‌న‌సు’ సినిమా టీజ‌ర్ ను అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు  ప్ర‌క‌టించారు మేకర్స్. శ‌ర్వానంద్, సాయిప‌ల్లవి జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు  హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకుడు. ఇటివలే కోల్ క‌త్తా, నేపాల్ లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా  ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చివరి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్  వ‌చ్చిందని… శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్క‌వుట్ అయిందని అంటున్నారు మేకర్స్. ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానుంది.