బాబు నిజంగా బంగారమే...

Wednesday,August 17,2016 - 04:59 by Z_CLU

విక్టరీ వెంకటేష్ మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. తాజాగా మరో విక్టరీ అందుకున్నాడు. వెంకీ నటించిన బాబు బంగారం సినిమా అన్ని ఏరియాస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి థియేటర్ నుంచి ప్రాఫిట్స్ సంపాదిస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా దాదాపు 18 కోట్ల రూపాయల వసూళ్లు సాధించగా… నైజాంలో కూడా బ్రేక్ ఈవెన్ కు దగ్గరైంది. నైజాం ప్రాంత హక్కుల కింద ఈ సినిమా 6కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా… అప్పుడే ఈ సినిమాకు దాదాపు 5 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ట్రేడ్ పండిట్స్ సమాచారం ప్రకారం… నైజాంలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ అందుకోనుంది బాబు బంగారం సినిమా. అంటే రేపట్నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి లాభం కిందే లెక్క. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది.