బాహుబలి-2 ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

Wednesday,August 17,2016 - 04:40 by Z_CLU

 

ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కీలకమైన యుద్ధ సన్నివేశాల షూటింగ్ లో ప్రభాస్-రానా బిజీగా ఉన్నారు. ఆగస్టు 30 వరకూ ఈ షెడ్యూల్ కు సంబంధించిన చిత్రీకరణ జరగనుందని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 న విడుదల చెయ్యడానికి యూనిట్ సన్నాహాలు చేస్తున్నారట. పార్ట్ 2 కి సంబంధించి ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కూడా విడుదల చెయ్యకపోవడంతో ఆ తేదీనే ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ప్రభాస్ అభిమానులకు పండగ తీసుకురావాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. త్వరలోనే దీనిపై అధికారికంగా ఓ వ్రకటన వచ్చే అవకాశముంది. బాహుబలి-2 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.