మరో రికార్డ్ ...

Wednesday,October 26,2016 - 07:03 by Z_CLU

సినిమా రిలీజ్ అయితే కానీ దాని భవిష్యత్తు ఏంటో ఎవరికీ తెలీదు. సినిమా సక్సెస్ కి సీక్రెట్ ఎవరికీ తెలీదు. కానీ రాజమౌళి కరియర్ దానికి భిన్నంగా ఉంటుంది. ఫ్లాప్ కి అర్థం కూడా తెలియని ఈ దర్శక బాహుబలి తన సినిమాకి ఇంకా ఆరు నెలల టైం ఉండగానే ట్రేడర్స్ లో భీభత్సమైన కాంపిటీషన్ ని క్రియేట్ చేస్తున్నాడు.

 ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ని కూడగట్టుకుంటున్న బాహుబలి 2 కేవలం రెండు తెలుగు రాష్టాలలో వసూలు చేసిన  మొత్తం తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ. సినిమా రిలీజ్ కి ఇంకా 6 నెలల టైం ఉంది. కానీ ఈ లోపే బాహుబలి 2 థియేట్రికల్ రైట్స్ పై ఏకంగా 137 కోట్ల వసూలు చేసుకుంది.

 తెలంగాణ స్టేట్ లో 50 కోట్లు వసూలు చేసిన బాహుబలి, రాయలసీమలో 27 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్రా, ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఏకంగా 60 కోట్ల బిజినెస్ చేసింది బాహుబలి.

 ఉత్తరాంధ్ర థియేట్రికల్ రైట్స్ కోసం 13.27 కోట్లు చెల్లించుకున్న వారాహి చలన చిత్రం బ్యానర్ కృష్ణా జిల్లాకు 9 కోట్లు, సీడెడ్ ఏరియాకి 27 కోట్లు చెల్లించి హక్కులు సొంతం చేసుకుంది. ఈ లెక్కలు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా రోజురోజుకి బాహుబలి 2 కి పెరుగుతున్న క్రేజ్ ని బట్టి  ట్రేడర్స్ లోను భారీ కాంపిటీషన్ నెలకొంటుంది.