రచయితగా మారిన బ్రహ్మి

Wednesday,October 26,2016 - 06:23 by Z_CLU

ఒకటా రెండా వెయ్యికి పైగా సినిమాలు, ఇంకా ఫ్యాన్స్ లో చెక్కు చెదరని క్రేజ్. ఎంతమంది కమెడియన్స్ వచ్చినా, ఎన్ని జనరేషన్స్ మారినా టాలీవుడ్ లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం స్థానం చెక్కు చెదరనిది. రీసెంట్ గా మెగాఫోన్ పట్టుకోనున్నాడనే వార్తలను ఖండించిన బ్రహ్మానందం… తన నటజీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, జయాపజయాలను ప్రస్తావిస్తూ ఆత్మకథ రాస్తున్నట్టు ప్రకటించాడు.

ప్రస్తుతం చిరు 150 వ సినిమాతో పాటు నాగార్జున నమో వెంకటేశాయ, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణీ, కమల్ హాసన్ శభాష్ నాయుడు సినిమాలతో బిజీగా ఉన్న బ్రహ్మానందం సమయం దొరికినప్పుడల్లా తన ఆటో బయోగ్రఫీ రాసుకుంటున్నాడు. 60 ఏళ్ల తన జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదీ తనకు రెడీమేడ్ గా దొరకలేదని చెప్పుకున్న బ్రహ్మానందం… ఆత్మకథతో తన అనుభవాలన్నీ పంచుకోబోతున్నారు.