థియేటర్లలో ధృవ టీజర్

Wednesday,October 26,2016 - 07:17 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వారం నుంచే థియేటర్లలో హల్ చల్ చేయబోతున్నాడు. చెర్రీ నటిస్తున్న ధృవ సినిమా ఈ వారం నుంచి వెండితెరపై సందడి చేయనుంది. అవును… స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమా టీజర్ ను ఈవారం నుంచి థియేటర్లలో ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఒక టీజర్… సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా… రెండో వీడియాను థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. స్టైలిష్ సినిమాల ఫిలిమ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధృవ టీజర్-2 లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను కవర్ చేయబోతున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదలకానుంది.