దుమ్ము దులిపిన ఎవెంజర్స్

Monday,April 29,2019 - 03:32 by Z_CLU

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎవెంజర్స్ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఎవెంజర్స్ సిరీస్ లో చివరి మూవీగా వచ్చిన ఎండ్ గేమ్ కళ్లుచెదిరే కలెక్షన్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. విడుదలైన 3 రోజుల్లో ఈ సినిమాకు (ప్రీమియర్స్ తో కలుపుకొని) 8400 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఒక్క యూఎస్ లోనే ఎవెంజర్స్-ఎండ్ గేమ్ కు 350 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. ఇది కచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే ఉద్దేశంతో నిఖిల్ తన సినిమాను కూడా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. నిఖిల్ ఊహించినట్టుగానే ఏపీ,నైజాంలో ఎండ్ గేమ్ కు ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా 18 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ప్రస్తుతం థియేటర్లలో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మహేష్ నటించిన మహర్షి సినిమా విడుదలైనంత వరకు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ హవా కొనసాగడం గ్యారెంటీ.