సాయిపల్లవి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా

Monday,April 29,2019 - 05:04 by Z_CLU

హీరో నిఖిల్ తన మ్యారేజ్ ప్లాన్స్ బయటపెట్టాడు. ఫిదాలో సాయిపల్లవి లాంటి అమ్మాయి కనిపిస్తే వెంటనే తాళి కట్టేస్తానంటున్నాడు. ఆ సినిమాలో భానుమతి పాత్ర తనకు చాలా ఇష్టమని, అలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయి కోసం వెయిటింగ్ అంటూ ప్రకటించాడు.

కేవలం భానుమతి క్రష్ మాత్రమే కాదు, అంతకంటే ముందు కమలినీ ముఖర్జీ, భూమిక పాత్రలతో కూడా క్రష్ ఉన్నట్టు ప్రకటించాడు నిఖిల్. గోదావరిలో కమలినీ పోషించిన సీత పాత్ర, ఖుషిలో భూమిక పోషించిన మధు క్యారెక్టర్స్ అంటే తనకు చాలా ఇష్టమని.. అలాంటి లక్షణాలున్న అమ్మాయి దొరికినా పెళ్లికి రెడీ అని ప్రకటించాడు.

అయితే ఇన్ని కబుర్లు చెప్పిన నిఖిల్ తనకు అప్పుడే పెళ్లీడు రాలేదంటున్నాడు. ప్రస్తుతం తన లవ్ మొత్తం సినిమాలేనని, పెళ్లికింకా చాలా టైం ఉందంటున్నాడు 33 ఏళ్ల నిఖిల్.