‘మన్మధుడు 2’ – ఎవరీ అక్షర గౌడ..?

Monday,April 29,2019 - 12:35 by Z_CLU

అంతకు ముందు పెద్దగాలేదు కానీ ‘మన్మధుడు 2’ పోర్చుగల్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమాలో అక్షర గౌడ సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందని, ఈ సినిమాతో గ్రాండ్ డెబ్యూ కి రెడీ అవుతుందని టాక్ బయటికి వచ్చింది. అసలెవరీ అక్షర గౌడ..? ‘నిజంగా మన్మధుడు 2’ లో నటిస్తుందా..?

స్ట్రేట్ గా క్వశ్చన్ కి సమాధానం చెప్పాలంటే అవును… అక్షర గౌడ ‘మన్మధుడు2’ లో నటిస్తుంది. ఇది ఈ అమ్మడుకు ఓ రకంగా డెబ్యూనే. కానీ అక్షర గౌడ ఈ సినిమాలో చేసేది జస్ట్ కామియో గానే. సినిమాలోని ఓ సందర్భంలో జస్ట్ అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతుందంతే. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతున్న  షూట్ లో కూడా జాయిన్ అయింది అక్షర.

తమిళంలో మంచి క్రేజ్ ఉంది అక్షరగౌడకి. తెలుగు సినిమాల్లో కూడా అంతే సీరియస్ గా ట్రై చేస్తుంది కానీ, సరైన అవకాశం రాక ఇంకా వెయిటింగ్ మోడ్ లోనే ఉంది. ఈ లోపు ‘మన్మధుడు2’ ఆఫర్ వచ్చేసరికి, నాగ్ సినిమాలో కామియో గా అయినా ఓకె అనేసింది.

‘రంగ్ రేజ్’ సినిమాతో బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన అక్షర గౌడ, ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాలు కలిపి 6 కు పైగా సినిమాల్లో నటించింది. ఇక ‘మన్మధుడు 2’ లో కనిపించేది కాసేపే అయినా, ఈ సినిమా తరవాత వరస అవకాశాలు గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ తో ఉంది.