డబ్బింగ్ సినిమాకు 500 థియేటర్లు

Tuesday,April 23,2019 - 03:56 by Z_CLU

కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాలపై కూడా విపరీతమైన క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఈ సీజన్ లో అలా క్రేజ్ సంపాదించుకున్న సినిమా ఎవెంజర్స్-ఎండ్ గేమ్. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ లో చివరిదైన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు తగ్గట్టు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏకంగా 500 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. హాలీవుడ్ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో స్క్రీన్స్ అంటే అది గొప్ప విషయం.

గత చిత్రంలో థానోస్‌ శక్తితో కనిపించకుండాపోయిన అవెంజర్స్‌ మళ్లీ తిరిగి ఎలా వచ్చారు? థానోస్‌ను ఎలా అంతం చేశారన్నదే ఈ కథ. థానోస్‌ పాత్రకి హీరో రానా తెలుగు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ‘ది అవెంజర్స్-ఎండ్ గేమ్’ కోసం సంగీత సంచలనం ఏ.ఆర్.రెహమాన్ థీమ్ సాంగ్ కంపోజ్ చేశాడు.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తున్న ఎండ్ గేమ్ మూవీని మార్వెల్ స్టుడియోస్ నిర్మించింది. రాబర్ట్‌ డౌనీ జూనియర్, క్రిస్‌ ఇవాన్స్‌, మార్క్ రఫాలో, క్రిస్ హేమ్స్ వర్త్, స్కార్లెట్ జాన్సన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.