బాలయ్య ప్రత్యేక అతిథిగా 'అరవింద సమేత' సక్సెస్ మీట్

Sunday,October 21,2018 - 11:02 by Z_CLU

మరికొన్ని గంటల్లో ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరగనుంది.. భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ఈవెంట్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారు. అదే పెద్ద హైలెట్.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేలాదిమంది ఆభిమానుల మధ్య జరగనున్న ఈ గ్రాండ్  ఈవెంట్ ను ‘జీ సినిమాలు ‘ యూట్యూబ్ ఛానల్ లో లైవ్ చూడొచ్చు.

ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ చేరుకున్న ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో కూడా భారీ వసూళ్ళు సాదిస్తూ 2 వీక్ లో అడుగుపెట్టి దసరా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.