ఆ హీరో నిర్మాతగా సూపర్బ్ -జగపతి బాబు

Sunday,October 21,2018 - 12:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన జగపతి బాబు లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు.. ‘అరవింద సమేత’ ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన జగపతి బాబు….. మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు జగపతి బాబు.. చరణ్ తో కలిసి ‘రంగస్థలం’ సినిమాలో నటించాను ఆ సినిమా కోసం నటుడిగా చాలా కష్టపడ్డాడు.. అయితే నిర్మాతగా చరణ్ మరింతగా నచ్చేసాడంటూ చెప్పుకొచ్చాడు.

దాదాపు మూడు వందల మందిని జార్జియా తీసుకెళ్ళి అందరినీ ఒకేలా ట్రీట్ చేసే విధానం బాగా నచ్చిందని… ఈ సినిమాలో చరణ్ కనిపిచకపోయినా నిర్మాతగా తన బాధ్యత ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడని  తెలిపాడు జగపతి బాబు.