రామ్ చరణ్ సినిమాకి టైటిల్ ఫిక్స్ ?

Sunday,October 21,2018 - 10:02 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీను  కాంబోలో తెర్కకెక్కుతున్న సినిమాకు ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ వాడుకలో ఉన్న సంగతి తెలిసిందే… ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ టైటిల్ నే సినిమాకు కన్ఫర్మ్ చేయబోతున్నారట.. ఇప్పటికే టైటిల్ డిజైనింగ్ వర్క్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. తన ప్రీవియస్ మూవీ కి  ‘జయజనకి నాయక’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన బోయపాటి మరో సారి అదే రూట్లో వెల్లబోతున్నాడు.

చరణ్ తో పాటు నిర్మాత దానయ్య కి కూడా టైటిల్ నచ్చడంతో చివరిగా ఇదే ఫైనల్ చేసారని… త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. చరణ్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.