దుమ్ముదులుపుతున్న అరవింద సమేత ట్రయిలర్

Thursday,October 04,2018 - 12:55 by Z_CLU

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమా ట్రయిలర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. సరిగ్గా 24 గంటలు గడిచేసరికి, వ్యూస్ పరంగా బాహుబలి-2 మినహా మిగతా అన్ని సినిమాల రికార్డుల్ని ఇది క్రాస్ చేసింది.

24 గంటల్లో ఈ సినిమా ట్రయిలర్ కు ఏకంగా 9.3 మిలియన్ వ్యూస్ రావడం గ్రేట్. ఇందులో ఏకంగా 3లక్షల 50వేల లైక్స్ కూడా ఉన్నాయి. బాహుబలి-2 సినిమా ట్రయిలర్ తర్వాత ఓ మూవీ ట్రయిలర్ కు ఇన్ని లైక్స్ రావడం ఇదే ఫస్ట్ టైం.

అరవింద సమేత సినిమాపై ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ డిజిటల్ వ్యూస్ చూస్తే తెలుస్తుంది. అంతేకాదు, 24 గంటలు దాటినా ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఇది నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ప్రతి గంటకు మినిమం 10వేల వ్యూస్ వస్తున్నాయి ఈ ట్రయిలర్ కి.