విశాల్ ‘పందెం కోడి 2’ ఫస్ట్ సింగిల్ – శివంగి పిల్ల

Thursday,October 04,2018 - 12:42 by Z_CLU

విశాల్ ‘పందెంకోడి2’ ఈ నెల 18 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసిన ఫిలిమ్ మేకర్స్, ఈ నెల 6 న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ‘శివంగి పిల్ల’ అంటూ ఉండబోయే ఈ సాంగ్, డెఫ్ఫినేట్ గా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

విశాల్ కరియర్ లో ఇది 25 వ సినిమా కావడంతో ఈ సినిమాను మరింత ప్రెస్టీజియస్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్. దానికి తోడు ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న యువన్ శంకర్ రాజా ఆల్బమ్ పై కూడా భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే అక్టోబర్ 6 న రిలీజ్ కానున్న ఈ సింగిల్ తో, సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయనున్నారు మేకర్స్.

విశాల్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.  లైకా ప్రొడక్షన్స్, విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.