మరో తెలుగు సినిమాలో అరవింద్ స్వామి

Thursday,February 09,2017 - 09:03 by Z_CLU

 ఒక్క సినిమాతోనే మోస్ట్ స్టైలిష్ విలన్ గా ఎట్రాక్ట్ చేసిన అరవింద్ స్వామి, ఇమ్మీడియట్ గా మరే సినిమాకి సంతకం చేసినట్టు తెలియరాలేదు. అంతలో మహేష్ బాబు- కొరటాల శివ సినిమాలో అరవింద్ స్వామి కూడా నటించే చాన్సెస్ ఉన్నాయనే బజ్ ఇప్పుడు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.

గతంలోను రామ్ చరణ్ ధృవ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు అరవింద్ స్వామి. ఆ క్యారెక్టర్ సినిమాపై చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. తన స్టైలిష్ ఎట్రాక్టివ్ లుక్స్ తో సినిమాకి పెద్ద ఎసెట్ అనిపించుకున్నాడు. అలాంటిది ఇప్పుడు మహేష్ బాబు సినిమాలోను అరవింద్ స్వామి అనగానే టాలీవుడ్ లో అప్పుడే చిన్న సైజు వైబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి. ఇంతకీ ఈ సినిమాలో అరవింద్ స్వామి మళ్ళీ విలన్ గా కనిపిస్తాడా..? లేకపోతే కొరటాల అరవింద్ స్వామి కోసం ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నాడా..?

aravind-swamy-another-telugu-film

అరవింద్ స్వామి గతంలో తనది కాని భాషలో నటించనని తేల్చి చెప్పేశాడు. బహుశా తెలుగులో ఇదే లాస్ట్ సినిమా అని ఆల్ మోస్ట్ డిక్లేర్ కూడా చేసేశాడు. కానీ ఇంతలో కొరటాల అదిరిపోయే క్యారెక్టరైజేషన్ తో అరవింద్ స్వామిని కన్విన్స్ చేశాడు అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ ని హీటెక్కిస్తుంది.