జీ సినిమాలు ( ఫిబ్రవరి 9th)

Wednesday,February 08,2017 - 10:03 by Z_CLU

prema-lekhalu-zee-cinemalu

నటీనటులు : జయసుధ, అనంత్ నాగ్, మురళి మోహన్

ఇతర నటీనటులు : అల్లు రామలింగయ్య, సత్యనారాయణ కైకాల, గిరిబాబు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సత్య

డైరెక్టర్ : k. రాఘవేంద్ర రావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : 1977

జయసుధ, మురళీ మోహన్ జంటగా నటించిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ ప్రేమలేఖలు. ప్రేమకు, నమ్మకానికి మధ్య ఉండే విలువల్ని అతి సున్నితంగా చెప్పిన సినిమా ప్రేమలేఖలు. K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యద్దనపూడి సులోచనా రాణి నవల ఆధారంగా తెరకెక్కింది. దర్శకేంద్రుని మార్క్ తో ఎంటర్ టైనింగ్ గా సాగే స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమాకి సత్య మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

===========================================================================

jeevana-tarangalu

నటీ నటులు : శోభన్ బాబు, కృష్ణం రాజు, వాణి శ్రీ,

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, అంజలీ దేవి, లక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వర రావు

మ్యూజిక్ డైరెక్టర్ : జె. వి. రాఘవులు

డైరెక్టర్ : తాతినేని రామారావు

ప్రొడ్యూసర్ : డి. రామానాయుడు

రిలీజ్ డేట్ : 1973

యద్దన పూడి సులోచనా రాణి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం జీవన తరగాలు. 1973 లో రిలీజ్ అయి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తరవాత ఈ సినిమాని హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాని మూవీ మొఘల్ రామానాయుడు గారు తెరకెక్కించారు.

==============================================================================

sri-mahalakshmi

నటీ నటులు : శ్రీహరి, సుహాసిని  షామ్న

ఇతర నటీనటులు : సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్. పవర్ ఫుల్ లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కనిపించిన శ్రీహరి నటన సినిమాకే హైలెట్. శ్రీహరికి అక్కగా సుహాసినీ మణిరత్నం సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఒక అమ్మాయిని హత్య చేసిన నేరంలో తొమ్మిది మంది అమ్మాయిలు అరెస్ట్ అవుతారు. ఆ  హత్య నిజానికి ఆ అమ్మాయిలే చేశారా..? లాయర్ లక్ష్మీ కృష్ణ దేవరాయ ఆ కేసును ఎలా చేధించాడు అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

ranga-the-donga-1

నటీనటులు  – శ్రీకాంత్, విమలా రామన్

ఇతర నటీనటులు – రమ్యకృష్ణ, తెలంగాణ శకుంతల, జీవీ, నాగబాబు

మ్యూజిక్ డైరెక్టర్  – చక్రి

డైరెక్టర్ –  G.V. సుధాకర్ నాయుడు

రిలీజ్ డేట్  – 2010, డిసెంబర్ 30

 

ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన జీవీ… దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా రంగ ది దొంగ. అప్పటికే దర్శకుడిగా మారి నితిన్ తో ఓ సినిమా తీసిన జీవీ… ఈసారి ఓ విభిన్న కథాంశంతో శ్రీకాంత్ ను హీరోగా పెట్టి రంగ ది దొంగ సినిమాను తెరకెక్కించాడు. సినిమాలో  విమలారామన్ పోలీస్ గా కనిపిస్తే… మరో కీలకపాత్రలో రమ్యకృష్ణ నటించింది.  తెరపై భయంకరమైన విలనిజం చూపించిన జీవీ… దర్శకుడిగా మాత్రం ఈ సినిమాలో మంచి కామెడీ పండించాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు చక్రి సంగీతం అందించాడు.

==============================================================================

veerudokkade-2

నటీ నటులు : అజిత్, తమన్నా

ఇతర నటీనటులు : సంతానం, ప్రదీప్ రావత్, విద్యుల్లేఖ

మ్యూజిక్ డైరెక్టర్  : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : J. శివకుమార్

ప్రొడ్యూసర్  : భారతి రెడ్డి

విలక్షణమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అజిత్. అందుకే అజిత్ కి సౌత్ ఇండియా మొత్తంలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తమిళంలో సూర్ హిట్టయిన ‘వీరం’ తెలుగులో వీరుడొక్కడే గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పాటలతో పాటు అజిత్ ఫైట్స్, స్టంట్స్ హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

==============================================================================

ek-niranjan

నటీ నటులు : ప్రభాస్, కంగనా రనౌత్

ఇతర నటీనటులు : సోను సూద్, ముకుల్ దేవ్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వేణు మాధవ్, మర్కాండ్ దేశ్ పాండే తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : ఆదిత్య రామ్ మూవీస్

రిలీజ్ డేట్ : 30 అక్టోబర్ 2009

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్ టైనర్ ఏక్ నిరంజన్. చోటు గా ప్రభాస్ ఆక్టింగ్ సినిమాకే హైలెట్. ఓ వైపు పోలీసులకు హెల్ప్ చేస్తూ మరోవైపు తన తలిదండ్రులను వెదుక్కుంటూ ఉంటాడు. ప్రభాస్, కంగనా రనౌత్ ల మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు పూరి జగన్నాథ్.

==============================================================================

avakaibiryani_poster

నటీ నటులు : కమల్ కామరాజు, బిందు మాధవి

ఇతర నటీనటులు : రావు రమేష్, వరుణ్ జొన్నాడ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణికాంత్ కద్రి

డైరెక్టర్ : అనీష్ కురువిల్ల

ప్రొడ్యూసర్ : శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల

రిలీజ్ డేట్ : 14 నవంబర్ 2008

శేఖర్ కమ్ముల నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఆవకాయ బిర్యాని. అనిష్ కురువిల్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ కామరాజు, బిందు మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు. మనికాంత్ కద్రి సంగీతం ఈ సినిమాకి ఎసెట్.