కమలహాసన్ ‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్ పోస్టర్

Tuesday,January 15,2019 - 11:03 by Z_CLU

సంక్రాంతి సందర్భంగా కమలహాసన్ ‘ఇండియన్ 2’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన మేకర్స్ ఈ నెల 18 నుండి సెట్స్ పైకి రానున్నారు. ఈ సినిమాపై ఆడియెన్స్ కి ఉన్న క్యూరియాసిటీకి తగ్గట్టే, ఫింగర్స్ క్రాస్డ్ స్టిల్ లో పోస్టర్ ని డిజైన్ చేసుకున్నారు మేకర్స్.

2.0 లాంటి బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ తరవాత శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. దానికి తోడు సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి గమనిస్తే సినిమా, ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ టైం స్పెండ్ చేసింది సినిమా యూనిట్. ఈ సారి ఈ ఇండియన్ ఫైట్ చేయబోయే రీజన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా, ప్రేక్షకుల్లో మాత్రం ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేశారు మేకర్స్. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుభాస్కరన్ ప్రొడ్యూసర్. కాజల్ అగర్వాల్ హీరోయిన్.