జీ సినిమాలు ( 15th జనవరి )

Monday,January 14,2019 - 10:03 by Z_CLU

లండన్  బాబులు 

నటీనటులు స్వాతి, రక్షిత్

ఇతర నటీనటులు : మురళి శర్మ, ఆలీ, రాజా రవీంద్ర, జీవా, సత్య, ధనరాజ్, అజయ్ ఘోష్, సాయి, సత్యకృష్ణ తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : కె.

డైరెక్టర్ : చిన్నికృష్ణ

ప్రొడ్యూసర్ : మారుతి

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2017

అంతర్వేది అనే పల్లెటూరిలో సాధారణ కుర్రాడిగా జీవితాన్ని గడిపే గాంధీ(రక్షిత్) అప్పుల కారణంగా దొంగదారిన లండన్ వెళ్లి డబ్బు సంపాదించాలని స్నేహితుడు(సత్య)తో కలిసి హైదరాబాద్ వస్తాడు. పాస్ పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ వీసా వరకూ జరిగే అన్యాయం నేపథ్యంలో గాంధీ… సూర్య కాంతం( స్వాతి)ని ఎలా కలుస్తాడు. ఈ క్రమంలో గాంధీ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..లండన్ వెళ్లాలని ఎన్నో కలలు కన్న గాంధీ చివరికీ లండన్ వెళ్లగలిగాడా… అనేది సినిమా కథాంశం.

==============================================================================

సైజ్ జీరో

నటీనటులు : అనుష్క శెట్టి, ఆర్య

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఊర్వశి, సోనాల్ చౌహాన్, అడివి శేష్, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి

ప్రొడ్యూసర్ ప్రసాద్ వి. పొట్లూరి

రిలీజ్ డేట్ : 27 నవంబర్ 2015

అధిక బరువు ఉన్నప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గని సౌందర్య అభిషేక్ తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమని పొందటం కోసం, అతి తక్కువ కాలంలో బరువు తగ్గించే క్లినిక్ లో కూడా జాయిన్ అవుతుంది. సౌందర్య అక్కడేం తెలుసుకుంటుంది..? చివరికి సౌందర్య బరువు తగ్గుతుందా..? అభిషేక్ ప్రేమను తను పొందగలుగుతుందా..? అనేదే ఈ సినిమా కథ. అనుష్క పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది.

==============================================================================

లౌక్యం

నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముకేష్ రిషి, సంపత్ రిషి, చంద్ర మోహన్, రాహుల్ దేవ్మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఆఇంట్లోంచి ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి  వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో ఆ అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఈ ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాతఆ లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడువెంకీ ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

 

బ్రహ్మోత్సవం

నటీనటులు మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి

రిలీజ్ డేట్ :  20 మే 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

బాబు బంగారం

నటీనటులు వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్

డైరెక్టర్ : మారుతి

ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V .  ప్రసాద్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016

తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

==============================================================================

లై
నటీనటులు నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జా, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ద్రుతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : హను రాఘవపూడి
ప్రొడ్యూసర్స్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర, వెంకట్ బోయనపల్లి
రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017
‘లై’ సినిమా స్టోరీ అంతా టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, తెలివితేటల మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ ఎలా కనెక్ట్ అవుతాడు, వీళ్లిద్దరి మధ్య ఉన్న దోబూచులాడిన సూటు చివరికి ఏమైంది.. హీరో-విలన్ మధ్య హీరోయిన్ పరిస్థితేంటనేది ‘లై’ స్టోరీ లైన్. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా నితిన్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసింది.