నిఖిల్ సరసన అను బ్యూటీ

Monday,October 19,2020 - 01:57 by Z_CLU

నిఖిల్ కొత్త సినిమా హీరోయిన్ ఎవరనే టాపిక్ పై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రాబోతున్న 18-Pages సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫిక్స్ చేశారు.

ఈ సినిమాకు సుకుమార్ కథ అందించాడు. అంతేకాదు, స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నాడు. అలా ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా కూడా మారాడు.

Nikhil-AnupamaParameswaran కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. అటు రాక్షసుడు మూవీ తర్వాత అనుపమ సైన్ చేసిన సినిమా కూడా ఇదే. 18-పేజెస్ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు