భూమిక అలియాస్ ఐశ్వర్య

Monday,October 19,2020 - 02:10 by Z_CLU

తమిళంతో పాటు తెలుగులో కూడా త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్. ఈమె నటించిన థ్రిల్లర్ మూవీ “భూమిక”. ఇది Aishwarya Rajesh కి 25వ సినిమా.

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్ ద్వారా విడుద‌ల చేసింది. ఈ చిత్రాన్ని ప్రముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు ప్రజెంట్ చేస్తున్నాడు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ జాయింట్ గా నిర్మిస్తున్నాయి.

గ‌తంలో ఇదే బ్యాన‌ర్ ద్వారా కీర్తి సురేశ్ హీరోయిన్ న‌టించిన పెంగ్విన్ మూవీ తెరకెక్కింది. కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న #Boomika మూవీకి ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌ుడు.

ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ బేస్ చేసుకొని థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను తీశారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అఫీషియ‌ల్ ఎనౌన్స్ చేస్తారు.