Nithiin - బ్యాక్ టు బ్యాక్ మూవీస్

Monday,October 19,2020 - 01:33 by Z_CLU

ఈ ఏడాది Bheeshma తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న Nithiin వచ్చే ఏడాది ప్రేక్షకులను తన అభిమానులను మరింతగా మెప్పించాలని చూస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓ మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు యూత్ స్టార్.

ఇప్పటికే RangDe సినిమాను వచ్చే సంక్రాంతికి ఎనౌన్స్ చేసిన నితిన్ ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే Check సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత కొన్ని నెలల్లోనే మళ్లీ Andhadhun రీమేక్ తో ఇయర్ ఎండింగ్ లోపు థియేటర్స్ లో అడుగు పెట్టాలని భావిస్తున్నాడు.

మరి ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడితే 2021 లో నితిన్ మంచి రికార్డు కొట్టినట్టే.