అజ్ఞాతవాసి కోసం డబ్బింగ్ చెప్పిన అనూ ఇమ్మాన్యువెల్

Wednesday,November 29,2017 - 04:10 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న అనూ ఇమ్మాన్యువెల్ ఇప్పుడు తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ‘మజ్ను’ సినిమాతో తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాత వాసి’ సినిమాలో తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. అ విషయం తనే ట్వీట్ చేసి కన్ఫం చేసింది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా తన క్యారెక్టర్ కి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్ సరసన నటించే చాన్స్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యువెల్, ఈ సినిమా తరవాత కమర్షియల్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోవడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్ సోర్సెస్.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి ప్రస్తుతం కాశీలో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. హారిక & హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై S. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.