గోవాలో అల్లు అర్జున్ నాపేరు సూర్య

Wednesday,November 29,2017 - 06:04 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఊటీలో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, రేపటి నుండి గోవాలో షూటింగ్ జరుపుకోనుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ నటిస్తుంది.

అల్లు అర్జున్ కరియర్ లోనే ఫుల్ స్పేస్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనుండటం ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే యాక్షన్ స్టార్ అర్జున్ గ్రే షేడ్స్ లో నటిస్తుండటం సినిమాపై ఇంట్రెస్టింగ్ హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఉండబోయే హెవీ సీన్స్ ని ఆల్ రెడీ తెరకెక్కించేసిన సినిమా యూనిట్,  ఈ సినిమాలో అల్లు అర్జున్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయనుంది.

లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న  ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ విశాల్ & శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 27, 2018 న రిలీజ్ కానుంది.