మరో సూపర్ హిట్ అందుకున్న లారెన్స్

Saturday,April 15,2017 - 10:00 by Z_CLU

కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకొని హీరోగా ‘స్టైల్’, ‘ముని’,’కాంచన’,’గంగ’ సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసి పలు సూపర్ హిట్స్ అందుకున్న లారెన్స్ లేటెస్ట్ గా సస్పెన్స్ హారర్ గా తెరకెక్కిన ‘శివ లింగ’ తో హీరోగా మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు..

పి.వాసు దర్శకత్వంలో లారెన్స్ సరసన రితిక సింగ్ కథానాయికగా రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వచ్చింది. తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాతో హారర్ సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారిని ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు లారెన్స్. ఓపెనింగ్స్ తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘శివలింగ’ ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో.. చూడాలి..