రానా అదరగొట్టేస్తాడట.

Saturday,April 15,2017 - 12:10 by Z_CLU

దగ్గుబాటి రానా లేటెస్ట్ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే..తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం…

ఇక ‘లీడర్’ వంటి పొలిటికల్ డ్రామా సినిమా తర్వాత విభిన్న సినిమాలతో ఎంటర్టైన్ చేసిన రానా మరో సారి పొలిటికల్ బాగ్రాప్ లో నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకొస్తుందా.. అంటూ క్యూరియాసిటీ తో వెయిట్ చేస్తున్నారు దగ్గుబాటి ఫాన్స్.. గతంలో ‘లీడర్’ గా తన దైన డైలాగ్ డెలివరీ తో అదరగొట్టిన రానా మరో సారి ఈ సినిమా తో జోగేంద్ర అనే పొలిటికల్ లీడర్ గా పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాడని ఇంసైడ్ టాక్.. తాజాగా వెంకటేష్ కూడా ఈ సినిమాతో రానా నటుడిగా మరో మెట్టు పైకెక్కడం ఖాయం అనడం, పైగా ఇండస్ట్రీ లో కూడా ఈ సినిమా పై పాజిటీవ్ బజ్ నెలకొనడంతో ఈ సినిమా పై అంచనాలు నెలకొంటున్నాయి. మరి ఈ సినిమాతో రానా పొలిటికల్ లీడర్ గా ఎలాంటి హిట్ అందుకుంటాడో..చూడాలి..