రంగస్థలం సినిమాలో హైలైట్ సాంగ్?

Friday,February 16,2018 - 11:02 by Z_CLU

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- రాక్ స్టార్ దేవిశ్రీ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందంటే ఆ ఆల్బమ్ కచ్చితంగా మ్యూజిక్ లవర్స్ కి ఫేవరేట్ ఆల్బమ్ అయిపోతుంది. ఇప్పటివరకూ సుకుమార్-దేవిశ్రీ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ఆల్బమ్ సూపర్ హిట్ అవ్వడమే దీనికి కారణం. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ సినిమాలోని ఫస్ట్ సాంగ్ ఇటీవలే రిలీజ్ అయి సోషల్ మీడియాలో ఎంతటి హంగామా చేస్తుందో చూస్తున్నాం.

అయితే ఈ సినిమాలో దీని కంటే అదిరిపోయే సాంగ్ మరోటి ఉందని.. ‘రంగమ్మ-మంగమ్మ’ అంటూ సాగే ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలవనుందని, రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ అందరికీ హాట్ ఫేవరేట్ అయిపోతుందని ఇన్ సైడ్ టాక్.

త్వరలోనే సోషల్ మీడియా ద్వారా ఈ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విలేజ్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 30న ప్రేక్షకుల ముందుకురానుంది.