దిల్ రాజు బ్యానర్ లో నాని కొత్త సినిమా

Friday,February 16,2018 - 01:50 by Z_CLU

‘నేను లోకల్’, ‘ MCA’ లాంటి బ్లాక్ బస్టర్స్ తరవాత మరోసారి దిల్ రాజు బ్యానర్ లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాని. సంవత్సరానికి మినిమం 3 సినిమాలు కంపల్సరీ అనే రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయిపోతున్న నాని, రీసెంట్ గా దిల్ రాజు చెప్పిన స్టోరీ లైన్ విని ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది.

ఈ నెల 24 న పూజా కార్యక్రమాలతో లాంచ్ కానున్న శ్రీరామ్ ఆదిత్య మూవీలో నాగార్జున తో కలిసి నటించనున్న నాని, మరో వైపు దిల్ రాజు రీసెంట్ గా ఒక స్టోరీ లైన్ చెప్పాడని, దానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే రూమర్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది.

ఈ ఇంట్రెస్టింగ్ రూమర్ అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అయితే కానీ, ఈ సినిమా డైరెక్టర్ విషయంలో క్లారిటీ రాదు. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సెట్స్ పై ఉన్న నాని, ఇప్పటికే హను రాఘవపూడి, విక్రమ్ కుమార్ లతో సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు.