నాని అప్ కమింగ్ మూవీస్

Friday,February 16,2018 - 10:02 by Z_CLU

ఏడాదికి మినిమం 3 సినిమాలు చేయడం నాని స్టయిల్. ఈ కొత్త సంవత్సరం కూడా అలానే 3 సినిమాలు రెడీచేసే పనిలో పడ్డాడు. ఇందులో భాగంగా కృష్ణార్జున యుద్ధం మూవీని ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన నేచురల్ స్టార్, మరో రెండు సినిమాల్ని ఎనౌన్స్ చేశాడు.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాని. ఇదొక మల్టీస్టారర్ మూవీ. నాగార్జునతో కలిసి నాని నటించనున్న ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. ఈనెల 24న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో 2 సినిమాలు చేయబోతున్నాడు. అయితే వీళ్లలో ఎవరి సినిమా ముందు సెట్స్ పైకి వస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తమ్మీద ఈ ఏడాది కూడా 3 సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు నేచురల్ స్టార్.