రంగస్థలం టైటిల్ సాంగ్ రిలీజ్

Friday,March 02,2018 - 06:56 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం. ఈ మూవీకి సంబంధించి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ మెలొడియస్ గా సాగితే.. తాజాగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ పక్కా మాస్ బీట్. ఫోక్ స్టయిల్ లో సాగింది ఈ పాట.

“వినబడేట్టు కాదురా.. కనబడేట్టు కొట్టండహే” అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ తో ఈ సాంగ్ స్టార్ట్ అయింది. రాహుల్ సిప్లిగంజ్ ఎంతో అద్భుతంగా ఆలపించాడు ఈ పాటని. మన పల్లెల్లో వినిపించే డబ్బు సౌండ్ ను యాజ్ ఇటీజ్ దించేశాడు దేవిశ్రీప్రసాద్. అదే ఈ పాటకు ప్లస్ పాయింట్.

ఇక చంద్రబోస్ సాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మొదటి పాటకు “ఎంత సక్కగున్నావే” అంటూ పల్లెటూరి సోయగాన్ని, సంస్కృతిని పాటలో చెప్పేసిన చంద్రబోస్.. ఈ టైటిల్ సాంగ్ లో ఒకింత తాత్వికత, భావుకతను ప్రదర్శించాడు. అందరూ హమ్ చేసుకునేలా చిన్నచిన్న పదాలతో అద్భుతంగా సాహిత్యం అందించాడు.