దిల్ రాజు సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో మరో సినిమా

Tuesday,August 14,2018 - 02:38 by Z_CLU

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ‘శతమానంభవతి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత దిల్ రాజు, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మరోసారి సక్సెస్ ఫుల్ కాంబో అనిపించుకుంది. అయితే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. ఆ సినిమాకి ఆల్రెడీ టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఫిలిమ్ మేకర్స్.

రీసెంట్ గా జరిగిన ‘శ్రీనివాస కళ్యాణం’ సక్సెస్ మీట్ లో దిల్ రాజు, ‘ఇప్పటికే సతీష్ వేగేశ్నకి  ఒక ఐడియా చెప్పాను. సతీష్ ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ పై పని చేయడం బిగిన్ చేశాడు. ఈ సినిమాకి ‘థాంక్యూ..’ అనే టైటిల్ ఫిక్స్ చేశాం. ‘మీకు ఎలా చెప్పాలో’ అనేది ఈ సినిమా క్యాప్షన్’ అని చెప్పుకున్నాడు దిల్ రాజు.

ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సినిమా యూనిట్, త్వరలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని బిగిన్ చేయనుంది. ఇక ఈ సినిమాలో నటించబోయే స్టార్ హీరో దగ్గరి నుండి తక్కిన టెక్నీషియన్స్ గురించి తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.