విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ

Tuesday,August 14,2018 - 05:22 by Z_CLU

సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ. పరశురాం డైరక్షన్ లో తెరకెక్కిన ‘గీతగోవిందం’ యూత్  లో రిలీజ్ కి ముందే పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం..

నో హాలీడే…

గత కొన్ని రోజులుగా ఒక్క రోజు కూడా హాలీడే లేకుండా పని చేస్తూనే ఉన్నా… ‘గీతగోవిందం’ రిలీజ్ తరవాత 1 వీక్ కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటా…

చాలా హ్యాప్పీ… కాకపోతే…

రెస్ట్ కూడా లేకుండా చేతినిండా ఆఫర్స్ ఉంటే చాలా హ్యాప్పీ కానీ, కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటేనే ఇంకా పని చేయగలుగుతాం.

చాలా స్పీడ్ గా జరిగిపోయింది…

ఈ సక్సెస్ ఫేజ్ ని ఎంజాయ్ చేసేంత టైమ్ కూడా లేదు. చాలా బిజీగా ఉన్నా. బ్యాక్ టు బ్యాక్ కమిట్ మెంట్స్. అంతా స్పీడ్ గా జరిగిపోయిందనిపిస్తుంది.

చిన్నప్పటి నుండి అంతే…

నేను చిన్నప్పటి నుండే చాలా కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఈ కన్ఫ్యూజన్ లో తప్పులు కూడా చేసేస్తుంటా…  నా దృష్టిలో తప్పులు చేయడం తప్పే కాదు.. నేను చేసిన తప్పులేమైనా ఉంటే ధైర్యంగా ఒప్పుకుంటా.. ఇంకెవరో చేసిన తప్పులు నాపై రుద్దితేనే ప్రాబ్లమ్..

యాక్టింగ్ కన్నా సింగింగే…

నాకు యాక్టర్స్ కన్నా సింగర్స్ ని చూస్తేనే చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది. సింగింగ్ అంటేనే చాలా ఇష్టం… చిన్నప్పుడు స్పోర్ట్స్ కోసం ఎందుకు సింగింగ్ క్లాసెస్ ఎగ్గొట్టానా అనిపిస్తుంది…

నా స్టాండర్డ్స్ కి అది సూపర్బ్…

‘వాట్ ద లైఫ్’ సాంగ్ నా స్టాండర్డ్స్ కి నేను చాలా బాగా పాడినట్టే. ఒకవేళ ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ లాంటి సాంగ్స్ పాడాల్సి వచ్చినప్పుడు ఆలోచించాలి కానీ, వాట్ ద లైఫ్ సాంగ్.. ప్రతి కుర్రాడు ఫీలయ్యే సాంగ్.. నా స్టాండర్డ్స్ కి నేను బెస్ట్ ఇచ్చాను… కానీ అది అందరికీ నచ్చలేదు…

ఇక్కడ ఇలా.. ఓవర్ సీస్ లో అలా…

వాట్ ద లైఫ్’ సాంగ్ వేరే సింగర్ తో పాడించారు. ఇండియాలో వేరే సింగర్ తో ఉంటుంది. కాకపోతే ఓవర్ సీస్ లో అప్పటికే ఆల్రెడీ ప్రింట్స్ వెళ్ళిపోయాయి కాబట్టి అక్కడ ప్రింట్స్ లో నా వాయిస్ ఉంటుంది. ఇక్కడ వేరే సింగర్ వాయిస్ ఉంటుంది.

 

అదే గీత గోవిందం…

హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే, తనను గెలవడానికి ఏమైనా చేస్తాడు అదే గీత గోవిందం. ఆ ప్రాసెస్ చాలా హిలేరియస్ గా ఉంటుంది…

ప్రస్తుతానికి అదొక్కటే ఆలోచన…

దాదాపు 1 ఇయర్ గా ఈ సినిమాకి పని చేస్తున్నాం కదా… జనాలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తారా..? ఎప్పుడు రిలీజవుతుందా అనే ఆలోచనే ఉంది ప్రస్తుతానికి..

‘ట్యాక్సీవాలా’ లేట్ కి రీజన్…  

ట్యాక్సీ వాలా CG వర్క్ వల్ల లేటవుతుంది. ఒక ప్యాటర్న్ లో CG వర్క్ జరిగేటపుడు మేము ఫైనల్ అయ్యేవరకు వెయిట్ చేశాం. కానీ చివరికి నచ్చలేదు. దాంతో మళ్ళీ చేయించాల్సి వస్తుంది… ఈ లోపు ‘గీతగోవిందం’ రెడీ అయ్యేసరికి ఇదే ఫస్ట్ రిలీజవుతుంది.