బాలయ్య -వెంకీ... ముందెవరు...?

Wednesday,January 16,2019 - 03:34 by Z_CLU

‘F2’తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అనిల్ సీనియర్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ తో పాటు వెంకీకి కూడా ఓ స్క్రిప్ట్ చెప్పాడు అనిల్. అయితే ఈ రెండిటిలో అనిల్ ముందుగా ఎవరితో సినిమా చేస్తాడా.. అనే క్యూరియాసిటీ నెలకొంటుంది. గతంలో బాలయ్య కి ‘రామారావు గారు’ అనే టైటిల్ తో ఓ స్క్రిప్ట్ చెప్పిన అనిల్.. బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆల్మోస్ట్ అనిల్ నెక్స్ట్ సినిమా ఇదే అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఇక ‘F2’ షూటింగ్ లో వెంకీ కి కూడా సోలో హీరోగా ఓ స్క్రిప్ట్ చెప్పాడు అనిల్. ఆ స్క్రిప్ట్ వెంకీ కి బాగా నచ్చిందట. ఈ విషయాన్ని వెంకటేష్ స్వయంగా తెలిపాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ ఇద్దరు సీనియర్లలో అనిల్ ముందుగా ఎవరిని డైరెక్ట్ చేస్తాడో..వేచిచూడాలి.