రాజపాండీ గెటప్ లో విజయ్ సేతుపతి

Wednesday,January 16,2019 - 01:38 by Z_CLU

సైరా సినిమాకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో ఇప్పటికే చూసేశాం. ఇదే సినిమా నుంచి నయనతార, అమితాబ్ లుక్స్ కూడా వచ్చేశాయి. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన విజయ్ సేతుపతి గెటప్ ను తాజాగా విడుదల చేశారు.

ఈరోజు విజయ్ సేతుపతి బర్త్ డే. ఈ సందర్భంగా సైరా సినిమా నుంచి అతడి లుక్ ను విడుదల చేశారు. సినిమాలో రాజ పాండీ అనే పాత్రను పోషిస్తున్నాడు విజయ్ సేతుపతి. సైరా నరసింహారెడ్డి సాగించే స్వతంత్ర్య పోరాటంలో అతడితో కలిసి యుద్ధం చేసే పాత్రలో రాజ పాండీ మెరుస్తాడు.

సైరాకు సంబంధించి మరో కీలక పాత్రధారి సుదీప్ గెటప్ ను ఇప్పటికే విడుదల చేశారు. అవుకు రాజు పాత్రలో సుదీప్ మెస్మరైజ్ చేయగా, ఇప్పుడు రాజ పాండీ గెటప్ లో విజయ్ సేతుపతి కూడా మెరిశాడు. తాజా లుక్ తో సినిమాకు సంబంధించిన కీలక పాత్రలన్నీ దాదాపు బయటకొచ్చేశాయి.