‘దటీజ్ మహాలక్ష్మి’ నుండి వెడ్డింగ్ సాంగ్

Wednesday,January 16,2019 - 04:48 by Z_CLU

‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా నుండి ‘వెడ్డింగ్ సాంగ్’ రిలీజయింది. ‘మా ఇంట్లో కళ్యాణానికి మీరందరూ రావాలి’ అంటూ  సాంగే ఈ సాంగ్ తో  సోషల్ మీడియాలో  ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా ఈ లిరికల్ వీడియోలో తమన్నా లుక్స్, ఆటిట్యూడ్ ఫ్యాన్స్ ని మరింత మెస్మరైజ్ చేస్తున్నాయి.

‘చిన్నా పెద్దా చుట్టూ చేరే…’ అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్ కి కృష్ణకాంత్ లిరిక్స్ రాశాడు. సినిమాలోని ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ కి జస్ట్ బిఫోర్, సెలెబ్రేషన్ మోడ్ లో ఉండబోయే ఈ సాంగ్ ని గీతామాధురి పాడింది. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజర్.

ఒక సాధారణ ఇన్నోసెంట్ అమ్మాయి తన లైఫ్ లో ఎక్స్ పెక్ట్ చేయని సంఘటన వల్ల ఏం తెలుసుకుంది..? అనే పాయింట్ చుట్టూ, ఇంట్రెస్టింగ్ సన్నివేశాలతో తెరకెక్కుతుంది ‘దటీజ్ మహాలక్ష్మి’. జాన్ ఖొరాకివాలా ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌గా మీడియెంట్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ లో మ‌ను కుమ‌రన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది  మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.