F3 Movie - ప్లాన్ మార్చిన దర్శకుడు

Tuesday,September 29,2020 - 05:14 by Z_CLU

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి F3 మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయి ఉండేది. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పనులు చకచకా జరిగి ఉండేవి. కానీ కరోనా/లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఆగిపోయింది.

అలా ఆగిపోయిన ఎఫ్3 మూవీ ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. మూవీకి సంబంధించి కొత్త ప్లాన్ సిద్ధం చేశాడు దర్శకుడు Anil Ravipudi. మరోసారి సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన ఈ డైరక్టర్, జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

కేవలం 5 నెలల్లో F3 ని పూర్తిచేసి, 2021 సమ్మర్ తర్వాత సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది అనీల్ రావిపూడి ప్లాన్.

సినిమాకు సంబంధించి ఇప్పటికే Varun Tej – Venkatesh కు కథ వినిపించినట్టు టాక్. అటు మెహ్రీన్ కూడా తను F3 Movie లో ఉన్న విషయాన్ని రీసెంట్ గా కన్ ఫర్మ్ చేసింది. మిగతా నటీనటుల్ని కూడా సెట్ చేసుకుంటే.. సినిమా జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మోడ్ లోకి వెళ్లిపోతుంది.