F3 పదిరోజుల్లో 110 కోట్లు

Monday,June 06,2022 - 05:30 by Z_CLU

F3 Movie Grosses 110 Cr Worldwide In 10 Days

విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ 3’ భారీ వసూళ్ళతో దూసుకెళ్తోంది. సినిమాలో హిలేరియస్ కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ క్యూ కట్టి డీసెంట్ కలెక్షన్స్ అందించారు.  పది రోజులకు గానూ వరల్డ్ వైడ్ గా  110 కోట్లు (గ్రాస్) రాబట్టి  వంద కోట్ల క్లబ్ లిస్టులో చోటు సంపాదించుకుంది.

నైజాం, కృష్ణా , గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని నిర్మాతలు దిల్ రాజు , శిరీష్ లు మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మిగతా ఏరియాల్లో కూడా దాదాపు 80 శాతం రికవరీ అయ్యింది. త్వరలోనే ఆ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వనుంది. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లో కూడా సినిమా మంచి వసూళ్ళు రాబడుతుంది.

వెంకటేష్ సరసన తమన్నా , వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఎఫ్ 3 భారీ సక్సెస్ సాధించడంతో  మేకర్స్ త్వరలోనే ఎఫ్ 4 ని ఎనౌన్స్ చేసి వాటి డీటెయిల్స్ చెప్పనున్నారు. బాలయ్య సినిమాతో పాటు మరో సినిమా కంప్లీట్ చేసి అనిల్ రావిపూడి ఎఫ్ 4 మొదలు పెట్టనున్నాడు. ఈసారి వెంకీ , వరుణ్ లతో పాటు మరో హీరో కూడా ఉంటాడని సమాచారం.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics