F3 Movie - 4 రోజుల వసూళ్లు

Tuesday,May 31,2022 - 02:31 by Z_CLU

F3 Movie 4 Days Collections

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్3 మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాకు సోమవారం నుంచి ఆక్యుపెన్సీ తగ్గుతుందని అంతా అనుకున్నారు. వర్కింగ్ డే కావడంతో వసూళ్లు ఆటోమేటిగ్గా తగ్గుతాయని అనుకున్నారు. కానీ ఎఫ్3 సినిమా మండే టెస్ట్ పాస్ అయింది. సోమవారం కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.

వర్కింగ్ డే అయిన సోమవారం నాడు ఈ సినిమాకు ఏపీ, నైజాంలో 4 కోట్ల 64 లక్షల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ రావడం విశేషం. ఓ సినిమాకు సోమవారం రోజున ఈ స్థాయిలో వసూళ్లు రావడం చాలా పెద్ద విషయం.

ఇక ఓవరాల్ గా ఈ 4 రోజుల్లో F3 Movieకి తెలుగు రాష్ట్రాల్లో 32 కోట్ల 11 లక్షల రూపాయల షేర్ వచ్చింది. తాజా కలెక్షన్లతో ఈ సినిమా 50 శాతానికి పైగా బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. ఈ వీకెండ్ కూడా ఇదే రెస్పాన్స్ వస్తే, ఈ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంటుంది.

అటు ఓవర్సీస్ లో కూడా ఎఫ్3 మెరిసింది. తాజా వసూళ్లతో ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్ (10 లక్షల డాలర్లు)లోకి ఎంటరైంది. సోమవారం యూఎస్ లో పబ్లిక్ హాలిడే కావడంతో, ఎఫ్3కి మరోసారి భారీ వసూళ్లు వచ్చాయి. అలా ఈ సినిమా మిలియన్ డాలర్ మూవీగా అవతరించింది.

అనీల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ ఫన్ ఎంటర్ టైనర్, థియేటర్లలో ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ వినోదాన్ని అందిస్తోంది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics