NTR బయోపిక్ – బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్

Thursday,October 04,2018 - 05:03 by Z_CLU

NTR బయోపిక్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాని 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. NTR లైఫ్ లోని నట జీవితాన్ని హైలెట్ చేస్తూ తెరకెక్కుతున్న మొదటి భాగం ‘కథానాయకుడు’ గా, ఆయన పొలిటికల్ లైఫ్ ని హైలెట్ చేస్తూ తెరకెక్కుతున్న రెండో భాగాన్ని ‘మహానాయకుడు’ అనే  టైటిల్  తో రిలీజ్ చేయనున్నారు. ఈ టైటిల్స్  తో పాటు ఈ సినిమాల ఫిక్స్డ్ రిలీజ్ డేట్స్ ని కూడా అనౌన్స్ చేశారు.

మొదటి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా 9 జనవరికి రిలీజైతే, దీని సీక్వెల్ ‘మహానాయకుడు’ రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 24 న రిలీజవుతుంది. మహా నటుడిగా, ఉమ్మడి  ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేసిన రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన NTR లైఫ్ ని 2 గంటల్లో ఎగ్జాక్ట్ గా ఎలివేట్ చేయడం కష్టమైన పనే. అందుకే సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.