అరవింద సమేత ఫస్టాఫ్ లో అదిరిపోయే ఎలిమెంట్

Thursday,October 11,2018 - 02:27 by Z_CLU

భారీ అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజయింది NTR అరవింద సమేత. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా, రిలీజైన ప్రతి సెంటర్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు వీర రాఘవ. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ లో వీర రాఘవుడి స్టామినా ఎలివేట్ అయ్యే రేంజ్ లో ఉన్న ఫైట్ సీన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. NTR సిక్స్ ప్యాక్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్.

ఫస్ట్ ఫైట్ తరవాత ఇమ్మీడియట్ గా ఉండే ‘రం..రుధిరం…’ సాంగ్ విజువల్స్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఇంపాక్ట్ సోషల్ మీడియాలో క్లియర్ గా కనిపిస్తుంది. NTR సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఫ్యాన్స్ కి కొత్త కాదు కానీ, దర్శకుడు త్రివిక్రమ్ NTR ని ప్రెజెంట్ చేసిన తీరు సినిమా నుండి బయటికి వచ్చాక కూడా హాంట్ చేస్తున్నాయి.

ఈ సినిమా సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కూడా అదే రేంజ్ అప్లాజ్ దక్కుతుంది. ఓవరాల్ గా ‘అరవింద సమేత’ NTR రేంజ్ ని రీచ్ అయింది.