Balayya Movie - సీనియర్ హీరోయిన్ రోల్ ఏంటి?

Saturday,May 08,2021 - 03:47 by Z_CLU

పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న బాలకృష్ణ నెక్స్ట్ గోపీచంద్ మలినేనితో మరో యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. సినిమాలో సీనియర్ హీరోయిన్ మీనా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనుందనే ప్రచారం జరుగుతుంది. సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో మీనా నటించనుందని టాక్.

ఇటివలే రవితేజతో తీసిన క్రాక్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ తో ఓ మంచి క్యారెక్టర్ చేయించి ఆమె పాత్రను ప్రేక్షకులకి బాగా కనెక్ట్ చేశాడు డైరెక్టర్ గోపిచంద్. సినిమాలో రవితేజ క్యారెక్టర్ తర్వాత జయమ్మ పాత్ర బాగా క్లిక్ అయ్యింది. సినిమా రిలీజ్ నుండి వరలక్ష్మి ని జయమ్మ అనే పిలుస్తున్నారు ఆడియన్స్. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా జయమ్మ లాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చే క్యారెక్టర్ నే డిజైన్ చేసి ఆ పాత్రను మీనాతో చేయించాలని భావిస్తున్నాడట దర్శకుడు. ఈ విషయం బాలయ్యకి చెప్ప్పగానే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

meena in balakrishna gopichand malineni movie

గతంలో బాలయ్య -మీనా కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. ఇద్దరూ హీరో హీరోయిన్స్ గా నటించి మంచి విజయాలు అందుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ కాంబోని తన సినిమాకు సెట్ చేసే పనిలో ఉన్నాడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘దృశ్యం 2’ రీమేక్ సినిమాలో నటిస్తుంది మీనా. ఆ సినిమా తర్వాత ఈ సీనియర్ హీరోయిన్ నటించబోయే సినిమా బాలయ్య దే కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే లాంచ్ కానుంది. జులై లేదా ఆగస్ట్ నుండి షూటింగ్ జరుపుకోనుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics