Mahesh Trivikram Movie - లిస్ట్ లో మరో అందాల తార?

Wednesday,May 05,2021 - 06:57 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ -త్రివిక్రమ్ కాంబో సినిమా ఇటివలే ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ప్రెజెంట్ సినిమాలో మిగతా క్యాస్టింగ్ తో పాటు క్రూ ని ఫైనల్ చేసే పనిలో బిజీ ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ఫిక్స్ అనే టాక్ నిన్నటి వరకు గట్టిగా వినబడింది. అయితే ఇప్పుడు అందాలతార శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ పేరు తెరపైకి వచ్చింది. తాజాగా మహేష్ సరసన జాన్వి కపూర్ అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.

నిజానికి శ్రీదేవి కూతురిని తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఆ లిస్టులో హారికా హాసినీ నిర్మాత రాధాకృష్ణ కూడా ఉన్నారు. తమ బేనర్ లో జాన్వి లాంచ్ జరగాలని ఆయన అనుకుంటున్నారట. అందుకే మహేష్ సినిమాకు ఆమెను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అయితే త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఆయన తీసిన గత కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ కచ్చితంగా కనిపిస్తున్నారు.

Janhvi Kapoor in mahesh trivikram movie

ఇలా చూసుకుంటే ఈ సినిమాలో పూజా తో జాన్వి కూడా కనిపించే అవకాశం ఉంది. జాన్వి రెండో హీరోయిన్ గా తీసుకుంటారేమో అన్న సందేహాలు కూడా ఉన్నాయి. ఈ క్రేజీ కాంబో సినిమాలో మహేష్ తో కలిసి నటించబోయే హీరోయిన్ ఎవరనేది మరికొన్ని రోజుల్లో మేకర్స్ నుండి వచ్చే ప్రకటనతో తేలనుంది. అప్పటి వరకు ఈ లిస్టులో మరింత మంది హీరోయిన్స్ చేరే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను రెడీ చేసే ప్లానింగ్ జరుగుతుంది. మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో 11 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics