Pawan Kalyan - కరోనా నుంచి కోలుకున్న పవర్ స్టార్

Saturday,May 08,2021 - 04:32 by Z_CLU

ఇటివలే పవన్ కళ్యాణ్ కరోన బారిన పడిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ అవ్వడంతో కరోన సోకిన వారం రోజులు ఇంట్లోనే స్పెషల్ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు పవన్. ఆ తర్వాత కూడా డాక్టర్లు పవన్ దగ్గరికే వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఆ టైంలో అభిమానులు పార్టీ నేతలు పవన్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. కొన్ని రోజులు కరోన వైరస్ సోకి ఇబ్బంది పడిన పవన్ తాజాగా కోవిడ్19 నుండి పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా పవన్ కి ఆర్.టి.పీ.సి.ఆర్ టెస్ట్ నిర్వహించారు వైద్యులు. ఆ టెస్టులో పవన్ కి కరోన నెగిటివ్ వచ్చిందని పవన్ టీం నుండి ప్రకటన వచ్చింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకున్నారని తెలియజేస్తూ జనసేన పార్టీ మీడియా బులెటిన్ విడుదల చేసింది. దీంతో పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

pawan kalyan corona zeecinemalu 1

ప్రస్తుతం కరోన ఎఫెక్ట్ నుండి బయట పడిన పవన్ ఇంట్లోనే విశ్రాంతి పొందుతున్నాడు. మరికొన్ని రోజుల తర్వాత పవన్ ఇంట్లో నుండే తన పనులు మొదలు పెడతాడు. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై పార్టీ శ్రేణులతో ఆన్లైన్ మీటింగ్స్ జరపనున్నారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే షూటింగ్స్ లో పాల్గొనున్నాడు. ప్రస్తుతం పవన్ రానా తో కలిసిన నటిస్తున్న సినిమాతో పాటు క్రిష్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టి వరుసపెట్టి పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics