అల్లు శిరీష్ "ఒక్క క్షణం" రిలీజ్ డేట్

Sunday,November 19,2017 - 09:50 by Z_CLU

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్ టైన‌ర్ త‌రువాత అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక్క క్ష‌ణం రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. “అల్లు శిరీష్ హీరోగా మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రానికి ఒక్క క్షణం అనే టైటిల్ పెట్టాం. టైటిల్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కొత్త చిత్రం గా అంద‌ర్ని అశ్య‌ర్యానికి గురిచేస్తుంది. ద‌ర్శ‌కుడు స్టైల్లో వుంటూ హీరో అల్లు శిరీష్ ని చాలా కొత్త‌గా మెగాఅభిమానుల్ని ఆక‌ట్టుకునేలా ఈ చిత్రం వుంటుంది.”అని అన్నారు.