మెగా కాంపౌండ్ లోకి నిఖిల్ దర్శకుడు

Saturday,November 26,2016 - 12:48 by Z_CLU

మెగా హీరో అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు.  ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో  సినిమా చేయడానికి డిసైడ్ అయిన శిరీష్ ఆ సినిమాను త్వరలోనే సెట్స్ పై పెట్టేందుకు చూస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ తో కలిసి మలయాళ సినిమ లో నటిస్తున్న శిరీష్ ఆ సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమా ను సెట్స్ పై పెట్టబోతున్నాడట. సైన్స్ ఫిక్షన్ కధాంశంతో రూపొందనున్న ఈ సినిమాను స్వామి రా రా నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మించనున్నాడు. ఈ సినిమా డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమై జనవరి నుంచి షూటింగ్ జరుపుకోనుంది.