అనుష్క ను మించిపోయిన శృతిహాసన్

Saturday,November 26,2016 - 03:40 by Z_CLU

సూర్య లేటెస్ట్ సినిమా ‘సింగం-3 ‘ విడుదలకి రెడీ అవుతుంది. ఇప్పటికే సింగం, సింగం-2 సినిమాలు  కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ సూపర్ హిట్స్ అవ్వడంతో… ఈ సీక్వెల్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. తాజాగా టీజర్ తో సోషల్ మీడియా లో దుమ్ముదులిపేసిన ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

        సూర్య సరసన అనుష్క, శృతిహాసన్  కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో శృతి తన గ్లామర్ తో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిందని టాాక్. తాజాగా విడుదలైన వై.వై.వై అనే పాట ప్రోమో లో అందరి చూపు ను తనవైపు తిప్పుకున్న ఈ భాామ… సింగం-3లో అనుష్క కంటే తనదే గ్లామర్ లో అప్పర్ హ్యాండ్ ఉండేలా కేర్ తీసుకుందట. అసలే మాస్ సినిమాలంటే తన గ్లామర్ తో రెచ్చిపోయే శృతి ఈసారి డోస్ మరింత పెంచేసిందట.