స్క్రిప్ట్ రెడీ.. ప్రకటించడమే ఆలస్యం

Sunday,June 17,2018 - 02:57 by Z_CLU

నా పేరు సూర్య విడుదలై చాలా రోజులైనా ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమా ఏంటనేది చెప్పలేదు బన్నీ. లిస్ట్ లో ముగ్గురు దర్శకులు ఉన్నప్పటికీ ఎవరికి ఛాన్స్ ఇస్తాడనే విషయంపై చాలా సస్పెన్స్ నడిచింది. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడింది.

తన నెక్ట్స్ సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు బన్నీ. కాకపోతే ఈ విషయాన్ని ఇంకా ఆఫీషియల్ గా ప్రకటించలేదు. ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ పారిస్ టూర్ లో ఉన్నాడు. తిరిగొచ్చిన వెంటనే ఎనౌన్స్ మెంట్ ఉంటుంది.

ఈ గ్యాప్ లో విక్రమ్ కుమార్ కు కొన్ని సూచనలు-సలహాలు ఇచ్చాడట బన్నీ. ఆ ప్రకారం స్క్రిప్ట్ సెకండాఫ్ లో విక్రమ్ కుమార్ కొన్ని మార్పులు చేస్తున్నాడు. ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత, మరోసారి ఫైనల్ నెరేషన్ విని అప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బన్నీ.