భారీ వసూళ్లతో దూసుకుపోతున్న రేస్-3

Sunday,June 17,2018 - 12:34 by Z_CLU

సల్మాన్-జాక్వెలిన్ హీరోహీరోయిన్లుగా నటించిన రేస్-3 సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే మిలియన్ మార్క్ టచ్ చేసిన ఈ సినిమా.. ఇండియాలో భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. 2 రోజుల్లో ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల నెట్ వచ్చింది.

విడుదలైన మొదటి రోజు (శుక్రవారం) ఈ సినిమాకు 28 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ వచ్చింది. ఫస్ట్ డే కంటే రెండో రేజు (శనివారం) రేస్-3కి వసూళ్లు పెరిగాయి. ఏకంగా 36 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ సాధించింది. అలా ఓవరాల్ గా 64 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి

ఈరోజు వసూళ్లతో కలుపుకుంటే ఈ సినిమా ఇండియాలో 3 రోజుల్లో వంద కోట్ల రూపాయల మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉంది. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ, సల్మాన్ స్టామినా ముందు ఆ టాక్ నిలవలేదు. ఈ సినిమా రియల్ రిజల్ట్ తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే.