ఆల్ మోస్ట్ ఫిక్స్: బన్నీ-త్రివిక్రమ్ సినిమా

Saturday,October 27,2018 - 12:01 by Z_CLU

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమైంది. వీళ్లిద్దరి కాంబోలో కొత్త సినిమా ఫిక్స్ అయింది. నా పేరు సూర్య తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న బన్నీ, ఎట్టకేలకు త్రివిక్రమ్ డైరక్షన్ లో నటించబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ 11న ఈ సినిమా లాంఛ్ అవుతుంది.

గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చాయి. ఆ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు రంగం సిద్ధమైంది. త్రివిక్రమ్ తీసిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత తరహాలోనే, బన్నీతో చేయబోయే సినిమా కూడా మోస్ట్ ఎమోషనల్ గా ఉండబోతోందని టాక్.

మరీ ముఖ్యంగా ఇది ఓ హిందీ సినిమాకు రీమేక్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో నిర్మాత అల్లు అరవింద్ ఓ అధికారిక ప్రకటన చేయబోతున్నాడు.