జయప్రదగా తమన్న ఫస్ట్ లుక్.. అతి త్వరలో

Saturday,October 27,2018 - 01:01 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ రోజురోజుకు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేస్తున్న ఫస్ట్ లుక్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆ బజ్ ను మరింత పెంచేలా త్వరలోనే మరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది యూనిట్. ఈసారి జయప్రద వంతు.

ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రద పాత్రలో నటిస్తోంది తమన్న. ఆమె ఇప్పటికే సెట్స్ పైకి వచ్చేసింది. ఎన్టీఆర్ పాత్రధారి బాలయ్య, తమన్న మధ్య ఆల్రెడీ ఓ సాంగ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఆ సాంగ్ స్టిల్ నే ఫస్ట్ లుక్ గా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబుగా రానా, ఏఎన్నార్ గా సుమంత్, శ్రీదేవిగా రకుల్, హరికృష్ణగా కల్యాణ్ రామ్ లుక్స్ ను విడుదల చేశారు. ఇప్పుడు జయప్రదగా తమన్న లుక్ కూడా విడుదలైతే సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 9న ఎన్టీఆర్-కథానాయకుడు చిత్రాన్ని, రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24 ఎన్టీఆర్-మహానాయకుడు చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.